- డిసెంబర్ 10 న ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభం
- జిల్లాలోనే ప్రప్రథమ ఆధునిక ఆసుపత్రి
- పేదలకు ఉచిత సేవలు (ఆపరేషన్స్ తో పాటు మందులు, కళ్లజోళ్లు ఉచితం)
- పేదలకు ఉచిత భోజన వసతి
అంధులకు వెలుగు నింపేందుకు ఆకివీడులో ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని ఈ నెల 10న ప్రారంభించున్నారు. జిల్లాలోనే ప్రప్రథమ ఆధునిక వసులతో రాష్ట్రంలోనే 19వ ఆసుపత్రిగా ఆకివీడు లో ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని నెలకొల్పారు.
లయన్స్ డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ డాక్టర్ ఎం.వి.సూర్యనారాయణరాజు, పతంజలి యెగారోగ్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పి.బి.ప్రతాప్ కుమార్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని ఆకివీడు లో నెలకొల్పడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. అత్యాధునికపరికరాలతో కంటి శస్త్రచికిత్సాలు చేసి విజయకేతనం ఎగరవేస్తున్న ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వైజాగ్ , విజయవాడ, ద్వితియాస్థాయి లో 19 ఆసుపత్రులు ఉన్నాయని, వాటిలో ఆకివీడు లో ఏర్పాటు చేసిన ఆసుపత్రి ఒకటన్నారు. ఆన్లైన్ లో అనుసంధానం చేస్తూ ఆధునిక వైద్యాన్ని అన్ని ఆసుపత్రులకు అందచేస్తున్న ఏకైక కంటి ఆసుపత్రి అని చెప్పారు. ఆకివీడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మూడున్నర దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలకు కంటి వైద్య శిబిరాలు నిర్వహించి అంధత్వం నుంచి వెలుగు నింపుతున్నామన్నారు. ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఏర్పాటుతో మరింత మందికి వెలుగు నింపే అవకాశం లభించిందని చెప్పారు. లయన్స్ ఎడ్యుకేషన్, మెడిసిన్ సొసైటీ అధ్యక్షుడు జానకిరామ్ మాట్లాడుతూ పేదలకు ఉచితంగా ఆపరేషన్స్ తో పాటు మందులు, కళ్లజోళ్లు ఉచితంగా అందచేస్తామన్నారు. ఆకివీడులో ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఏర్పాటు చెయ్యడం ద్వారా కృష్ణ జిల్లాలోని కలిదిండి, కైకలూరు, మండవల్లి మండలాలతోపాటు పశ్చిమగోదావరి జిల్లాలోని 40 మండలాలకు అందుబాటులో ఆసుపత్రి ఉందన్నారు.
తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు మండలాల నుంచి పెదాలు వచ్చి కంటి పరీక్షలు , ఆపరేషన్లు, కళ్లజోళ్లు పొందవచ్చని, పేదలకు ఉచిత భోజన వసతి అందచేస్తారని చెప్పారు.
ఆసుపత్రిలో సేవలు : ఎల్ వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ కు చెందిన కంటి ఆసుపత్రులు ప్రపంచస్థాయి కంటి ఆసుపత్రిని పేరూరి వెంకటేశ్వరులు, కాశికాంతమ్మ నేత్ర వైద్య కేంద్రంగా ఆకివీడు లో ప్రారంబిస్తున్నటు ఆసుపత్రి ఇంచార్జి వెంకటరావు చెప్పారు.
ఆకివీడు ఆసుపత్రిలో సమగ్ర కంటి పరీక్షలు, శుక్లానికి ఆధునిక శస్త్రచికిత్సా , కార్నియల్ ఇన్ పేకేషన్స్ , గ్లకోమా వైద్యం, మధుమేహ సంబంధిత రెటినోపతి, దృష్టి మాంద్యత సేవలు అందచేయునున్నట్టు చెప్పారు. అతి క్లిష్టమైన, ప్రత్యేక సేవలు, విజయవాడలోని తాడిగడపలో కోడె వేంకటాద్రి చౌదరీ ఆసుపత్రికి అనుసంధానం చేస్తాం అన్నారు.