Date: 21-DEC-2018
కాలుష్య నియంత్రణ అధికారి వెంకటేశ్వర్లు
కాలుష్య నియంత్రణ అధికారి వెంకటేశ్వర్లు
ఆకివీడు : రోడ్లు, డ్రెయినేజీల్లో చెత్త వేస్తే జరిమానా తప్పదని కాలుష్య నియంత్రణ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామంలో పలువురి ఇళ్లకు చెత్త ఎక్కడ వేస్తున్నారంటూ ప్రశ్నించారు. మూలలంక బోదేను పరిశీలించి మాట్లాడారు. వాతావరణ కాలుష్యం నివారించేందుకు గ్రామాల్లో ప్రతి ఒక్కరూ చెత్త వ్యర్ధాల నిర్వహణాలో భాగస్వాములు కావాలన్నారు.
ఇళ్లలోని చెత్తను తడి, పొడి చెత్తగా వేర్వేరు గా పంచాయతీ శానిటేషన్ సిబ్బందికి అందజేయాలన్నారు. కుళ్లిపోయే స్వభావం గల చెత్తను తడిగా, కుళ్ళని చెత్తను పొడి చెత్తగా వేరుచేసి అందజేయడం వల్ల అందరు ఆరోగ్యవంతులుగా జీవిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో ప్రభాకర్, ఈవోపీఆర్డి సత్యనారాయణ, కార్యదర్శి ఠాగూర్ తదితరులు ఉన్నారు.