ఆకివీడు: నియోజకవర్గంలో అనేక గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసిన రహదారులతో పాటు అంతర్గత మార్గాలు ప్రమాదకరంగా మారాయి. ఇటీవల ఆకివీడు, ఉండి, కాళ్ళ, పాలకోడేరు మండలాల్లోని పలు గ్రామాల్లో రోడ్లు మరమ్మతులు చేశారు. కానీ ప్రమాదకర మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు లేవు. అక్కడక్కడా మొక్కుబడిగా ఉన్నా కొత్త వారు గుర్తించని విధంగా ఉన్నాయి. ఫైగా మలుపులో పిచ్చి మొక్కలు, దుకాణాలు ఉండటం వల్ల ఎదురుగా వచ్చె వాహనాన్ని గుర్తించడం కష్టంగా ఉంటోందని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆకివీడు మండలంలో 26 కిలోమీటర్ల పరిధిలో ఏకంగా 28 మలుపులు, కాళ్ల మండలం పరిధిలో 25 కిలోమీటర్లలో 80కి పైగా మలుపులున్నాయి. దీనిపై ఆకివీడు ఆర్ అండ్ బి ఏఈ వర్మ మాట్లాడుతూ ప్రమాదకర మలుపులను గుర్తించి కొన్ని ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఏర్పాటుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానుని వెల్లడించారు.