*లాఠీలకు పనిచెప్పిన పోలీసులు
*రహదారులపై పడిపోయిన తెదేపా , వైకాపా కార్యకర్తలు
*జాతియ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం
ఉండి నియోజకవర్గం లో వైసీపీ అభ్యర్థి పీవీల్ నరసింహరాజు , టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు శుక్రవారం నామినేషన్ ధాఖలు చెయ్యడానికి ఇద్దరు అభ్యర్థులు ఇంచుమించు ఒకే సమయంలో ర్యాలీ గా నామినేషన్ వేసేందుకు ఉండి మండల కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీ , వైసీపీ శ్రేణుల మధ్య పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఎన్నికల నిబంధన ప్రకారం ఐదుగురు సభ్యులుకు మాత్రమే లోపలికి అనుమతి ఉందని పోలీస్ లు వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిచిన పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు వారి లాటీ కి పనిచెప్పారు. రెండు పార్టీ లకు చెందిన కార్యకర్తలను కొంత దూరం వరకు తరిమారు కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.