ఆకివీడు టూ మోటూరు రెండో లైన్ పూర్తి
తొలిసారి కొత్త పట్టాలెక్కిన నాగరసోల్
ఆకివీడు , ఆగష్టు 10 2019 : ఆకివీడు నుంచి మోటూరు 40 కి.మీ., వరకు నూతనంగా ఏర్పాటు చేసిన డబల్ లైన్ల పై శుక్రవారం నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం రైల్వే అధికారులు నాగరసోల్ రైలుకు పూజలు చేసి పచ్చ జెండా ఊపి రాకపోకలు ప్రారంభించారు. దీనివల్ల సమయం కూడా ఆదా అవుతుందని ప్రయాణికులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. గుడివాడ వైపు వెళ్లే రైళ్లు కొత్తగా నిర్మించిన పట్టాలపై , ఆకివీడు వైపు వచ్చే రైళ్లు పాత పట్టాలపై నడిపిస్తారని రైల్వే అధికారులు చెప్పారు. మార్చి 2020 నాటికీ విజయవాడ - నిడదవోలు విద్యుర్దికరణ పనులు ప్రారంభమవుతాయన్నారు. డబ్లింగ్ పనులు స్పీడ్ గా జరుగుతుండడంతో మూడు,నాలుగు నెలలకు ఒక సెక్షన్ పూర్తవుతుందన్నారు.