604 సంవత్సరాల పురాతన శివలింగం లభ్యం
ఆకివీడు : పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు మండలం శివారు ధర్మాపుర అగ్రహారములో బుధవారం నాడు పూజ పునస్కారములు లేకుండా ఉన్న పురాతన శివలింగం లభ్యమైంది. ధర్మపురం గ్రామంలో పంట పొలాల్లో తుప్పల మధ్య శివలింగాన్ని స్థానికులు గుర్తించారు.

ఈ వార్త ఆ నోటా ఈ నోటా తెలియడంతో స్పందించిన స్థానికులు పూజారులు విగ్రహాన్ని శుభ్రపరచి పూజ, అభిషేకములు జరిపించారు. శివలింగం పై బాణం గుర్తులున్నాయి. శ్రీకాళహస్తి లో ఉన్న శివలింగం గా ఉండటంతో మహిమగల శివలింగం గా చెబుతున్నారు. ఈ లింగము ఆకుపచ్చ రంగులో కనపడడం విశేషం.
హిందూ ధర్మాన్ని ఆచరించేవారు ఈ శివలింగ చరిత్ర 1815లలో బ్రిటిష్ దొర రాబర్ట్ సెవెల్ గారిచే తరయారు చేయించిన లిస్ట్స్ ఆఫ్ యాంటిక్విరైన్ రిమైన్స్ అనే పుస్తక సంకలనమునందు ఆంధ్ర దేశమునందు గల పురాతన ఆలయాల చరిత్ర క్రోడీకరించిన గ్రంధము నందు పశ్చిమ గోదావరి జిల్లా లో భీమవరం తాలూకా ఉండి గ్రామానికి ఆరు మైళ్ళ పశ్చిమమున ధర్మాపురం గ్రామంలో ఒక శివాలయం నాలుగు వందల సంవత్సరములు క్రితం ఉండినదని వ్రాయబడినది , అంటే 1815 నాటికి నాలుగు వందల సంవత్సరములు క్రితం అంటే ఇప్పటివరకు లెక్కిస్తే "ఆరు వందల నాలుగు (604సం)" సంవత్సరములు పురాతనం శివలింగం గా తెలియజేస్తుందని నందిగామ ఫణి శేషగిరి రావు తెలిపారు.