Ads by Google


వైద్య సహాయం అందక 7 నెలల గర్భిణీ మృతి

Date: 14-07-2020 ఆకివీడు రూరల్: అయి భీమవరం గ్రామానికి చెందిన నక్క నిర్మల కుమారి (23) అనే 7 నెలల గర్భిణీ సోమవారం మృతి చెందింది. ఆమె భర్త ఎలిష... thumbnail 1 summary
Date: 14-07-2020

ఆకివీడు రూరల్: అయి భీమవరం గ్రామానికి చెందిన నక్క నిర్మల కుమారి (23) అనే 7 నెలల గర్భిణీ సోమవారం మృతి చెందింది. ఆమె భర్త ఎలిషా తెలిపిన వివరాల ప్రకారం నిర్మల కుమారి అనారోగ్యానికి గురికావడంతో ఆదివారం రాత్రి స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని, లేకపోతే తాము వైద్యం చేయబోమని చెప్పడంతో ఆమెను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ అదే సమాధానం రావడంతో భీమవరం నుంచి ఏలూరు సోమవారం ఉదయం తీసుకెళ్లగా అక్కడ బెడ్ మీద కూర్చుని తుది శ్వాస విడిచింది. తన భార్య కు కరోనా నెగిటివ్ అని గతంలో చేసిన టెస్టులు గురించి చెప్పిన డాక్టర్లు పట్టించుకోలేదని ఎలీషా ఆవేదన వ్యక్తం చేసాడు. సకాలంలో వైద్యం అందకపోవడంవల్లే తన భార్య మృతి చెందిందని, ఏలూరు లో కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని చెప్పాడు. కరోనా బారినపడి కొంతమంది చనిపోతుంటే, కరోనా భయంతో వైద్యం చేయకపోవడంతో మరికొంతమంది చనిపోతున్నారని, ఈ దుస్థితి ఎవరికీ రాకూడదని ఎలీషా వాపోయాడు.
Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9and Google Chrome and Mozilla Firefox
Copyright©2020 All Rights Reserved. Manaakividuinfo.com Website.