ఆకివీడు: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో ' అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ' నిర్మాణానికి రూ. 80 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ సెంటర్ నిర్మాణానికి వారపుసంత ప్రాంతంలో స్థలాన్ని కేటాయించారు. దింతో పలువురు వ్యాపారాలు నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ సాల్మన్ రాజు ని కలిసి సుమారు 40 ఏళ్ళ నుంచి సుమారు 200 దుకాణాలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు ఆసుపత్రి నిర్మాణం చేస్తే ఉపాధికి ఇబ్బంది కలుగుతుందని విన్నవించారు. సంతలో వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ వ్యాపారులకు వివరించారు.