Ads by Google


వృధురాలికి ఇల్లు కట్టించి మానవత్వం చాటిన 15 వార్డు వైస్సార్సీపీ కౌన్సిలర్ జాన్ వెస్లీ

Date : 27-11-2021 ఆకివీడు అర్బన్: ఎన్నికల ప్రచారంలో ఓటు అభ్యర్ధించేందుకు వెళ్లిన  సమయంలో పూరి గుడిసెలో దయనీయ పరిస్థితి లో ఉన్న వృధురాలికి చ... thumbnail 1 summary
Date : 27-11-2021

akividu 15th ward councillor katikitala john wesley construct free house for older women

ఆకివీడు అర్బన్: ఎన్నికల ప్రచారంలో ఓటు అభ్యర్ధించేందుకు వెళ్లిన  సమయంలో పూరి గుడిసెలో దయనీయ పరిస్థితి లో ఉన్న వృధురాలికి చూసి చలించిన 15వ వార్డు వైస్సార్సీపీ కౌన్సిలర్ కటికితల జాన్ వెస్లీ ఆమెకు గూడు కల్పించేందుకు శ్రీకారం చుట్టి తన మానవత్వాన్ని చాటారు. వివరాల్లోకి వెళ్ళితే జాతీయ రహదారిని చేర్చి, జడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా పాడుబడిన పూరి పాకలో వృదురాలు బొమ్మిడి లక్ష్మి నివసిస్తుంది. భర్త చనిపోగా బంధువులు పట్టించుకోవడం మానేశారు. దివ్యంగురాలైన కుమార్తె తో కలిసి వృద్దురాలికి వచ్చే పెన్షన్ తో జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల నగర పంచాయతీ ఎన్నికల సందర్బంగా ఇంటింట ప్రచారానికి వచ్చిన కటికితల జాన్ వెస్లీ వృధురాలిని ఓటు అడిగేందుకు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో శిథిలిమైన పూరిపాకలో వర్షానికి తడిసిపోయి, ఇంటి ముందు బురద, దుర్వాసనలో జీవిస్తుండడం గమనించి చలించి పోయారు. ఎన్నికల అనంతరం తను గెలిచినా, ఓడిన వృద్ధురాలికి ఉండడానికి గూడు నిర్మిస్తానని సంకల్పించారు. అనంతరం కౌన్సిలర్ గా గెలుపొందగా, గురువారం చైర్ పర్సన్ జామి హైమావతి మరియు 15 వార్డు కౌన్సిలర్ కటికితల జాన్ వెస్లీ వృధురాలి ఇంటికి వెళ్లి పరిశీలించారు. పూరి గుడిసె స్థానంలో షెడ్డు నిర్మాణానికి వృదిరాలితోనే కొబ్బరికాయ కొట్టించి నిర్మాణం ప్రారంభించారు. ఇంటి నిర్మాణానానికి  30 వేలు నుంచి 50 వేలు ఖర్చవుతుందని తెలిపారు, వృద్ధురాలి కూతురికి దివ్యంగా పెన్షన్ మంజూరుకు కృషి చేస్తానన్నారు.  

Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2024 All Rights Reserved. Manaakividuinfo.com Website.