Date : 21-02-2023
ఆకివీడు టౌన్ : పురపాలక సంఘాలకు, నగరపాలక సంస్థలకు, నగర పంచాయతీలకు ప్రధాన ఆదయ వనరులు ఆస్థి పన్ను, పారిశుధ్యం, వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థలను సక్రమంగా నిర్వహించాలంటే ఈ నిధులే ఆధారం. ఎంతో కీలకమైనా పన్ను వసూళ్లలో ఏ మాత్రం అశ్రద్ధ చూపించిన నిధులు లేమి వల్ల పట్టణంలో రోజువారీ పనులకు ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి సంబంధించి ఆస్తి పన్ను వసూళ్లకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎరియర్స్ తో కలుపుకుని పన్ను వసూలు 70శాతం దాటినా మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్ధం. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇంతవరకు ఏలూరు జిల్లా లో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 60 శాతం పన్ను వసూళ్లలో మొదటి స్థానం లో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు మున్సిపాలిటీ 66 శాతం పన్ను వసులు చేసి మిగిలిన మున్సిపాలిటీల కంటే ముందజం లో ఉంది.