Ads by Google


పురాతన రామాలయం దగ్గర ఉద్రిక్తత

Date: 09-03-2026 ఆకివీడు టౌన్: ఆకివీడు పెదపేట ప్రాంతంలో జీర్ణావస్థకు చేరుకున్న పురాతన రామాలయాన్ని ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదివారం ప... thumbnail 1 summary
Date: 09-03-2026
ఆకివీడు టౌన్: ఆకివీడు పెదపేట ప్రాంతంలో జీర్ణావస్థకు చేరుకున్న పురాతన రామాలయాన్ని ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమోహన్, భాజపా నాయకుడు మాణిక్యాలరావు ఉపస భాపతికి రామాలయం స్థలం, గుడికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. రామాల యాన్ని పునఃనిర్మాణాన్ని చేపడతామని రఘు రామకృష్ణరాజు చెప్పారు. ఈ ప్రాంతంలో ఉండేది అందరూ క్రైస్తవులేనని, గతంలో ఇక్కడ సత్రం ఉండేదని రామాలయం కట్టవద్దని స్థానికులు కోరారు. దీనికి ఉపసభాపతి మాట్లాడుతూ పూర్వం నుంచి ఉన్న రామాలయం నిర్మిస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటి? మీరు చెప్పిన విషయాల్లో ఆధారాలు ఉంటే తహసీల్దార్ దగ్గర నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకురావాలని, ఆలయం పునఃనిర్మించడం జరుగుతుందని చెప్పి ఆయన కారులో అక్కడి నుంచి వెళ్లే క్రమంలో భాజపా కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ నినా దాలు చేశారు. దీంతో  క్రైస్తవ యువకులు భాజపా నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు తోసుకుంటూ సమీపంలో ముళ్లపొదల్లో పడిపోవడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కొందరు ఉప సభాపతి కారును అడ్డుకునేందుకు వెంబడించారు. ఎస్సై నాగరాజు, పోలీసులు అప్రమత్తమై వాహనాలను అక్కడి నుంచి పంపించి వేశారు. ఘర్షణకు దిగిన వారిని చెదరగొట్టి అక్కడి నుంచి పంపించి వేశారు.

దళితులపై దాడులు ఆపాలని నిరసన
ఆకివీడు పెదపేట ప్రాంతం నుంచి పలువురు దళిత నాయకుల ఆధ్వర్యంలో స్థానికులు పెద్దఎత్తున ఆదివారం రాత్రి ప్రదర్శనగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలివెళ్లారు. దళితులపై దాడులు ఆపాలని, మత విద్వేషాలను రెచ్చగొట్టకూడదంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ రఘువీర్ విష్ణుకు సమస్యలను విన్నవించారు. భీమవరం సీఐ కాళీచరణ్, ఎస్సై నాగరాజు ఉన్నారు.
Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2025 All Rights Reserved. Manaakividuinfo.com Website.