Akulavada, Akunidavada, Akuvada, Akividu
మన ఆకివీడు చరిత్ర
నాటి ఆకులవాడే నేటి ఆకివీడు
చరిత్ర :
ఆకివీడు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, మరియు ఆకివీడు మండలానికి కేంద్రాలయం. ఇటీవల బాగా అభివృధ్ధి సాధించి దగ్గర పట్టణమైన భీమవరంతో పోటీపడే స్థాయికి ఎదిగింది.మన ఆకివీడు చరిత్ర
చరిత్ర :
ఆకివీడు గ్రామంలో అందరూ వరి పంట ఎక్కువుగా పండిచేవారు. అందువలన ఒకానొక సమయంలో రాష్ట్రములోనే అత్యధికంగా బియ్యం మిల్లులు ఉండేవి. పరిసర ప్రాంతాలు అన్నీ పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. 1990లో చేపల,రొయ్యల పెంపకం జోరు అందుకుంది. ఆ తరువాత బియ్యం మిల్లులు తగ్గుముఖం పట్టాయి. కాని ఆర్ధికంగా అభివృధ్ధి చెందింది.రాష్ట్రములో రెండొవ అతి పెద్ద నీటి సరస్సు ,కొల్లేరు సరస్సు, ఆకివీడు గ్రామం ద్వారా చేరవచ్చు.
రాష్ట్రంలోనే అతిపెద్ద పంచాయితీ ఆకివీడు... మున్సిపాలిటీ స్థాయికి ఎదిగిన మండలం కేంద్రం ఆకివీడు, సామజికంగా, చారిత్రాత్మకంగా , ప్రాశస్త్ర్యం గల గ్రామం, ఒకప్పుడు తాలూకా, సమితి, కేంద్రంగా ఉన్న 'ఈ గ్రామం' ప్రపంచ ప్రసిద్దిచెందిన, సహజసిధమైన మంచినీటి సరస్సు 'కొల్లేరు' కు ముఖ ద్వారంగా బాసిల్లుతుంది. చరిత్ర ప్రారంభంలో కొల్లేటి తీరంలో నామమాత్రంగా జన సాంద్రత ఉన్నప్పటికీ ఎక్కువ శాతం వలసజీవుల కేంద్రంగా ఉండేది. ఆ సమయం లో ఎ ప్రాంత్రం మర్రి చెట్లు ఎక్కువగా ఉండేవని తెలుస్తోంది . ఆ రోజుల్లో మర్రి ఆకుల నిదాన ఈ గ్రామం ఏర్పాటు అయ్యిందని చారిత్రక కధనం. ఆ క్రమంలోనే మర్రి అకులవడగా నాడు పిలిచేవారని కాలక్రమంలో మర్రిపధం కనుమరుగై ఆకునీడవాడగ మిగిలింది. పరిణామక్రమంలో అకువాడగా గ మారింది. ఈ అతి చిన్న వాడకు చెందిన బంధువు గోల్ల్కొండ నవాబుల కాలంలో మహామంత్రిగా పనిచేసిన అక్కన్న ఈ గ్రామానికి పున: నిర్మాణం చేసారని ఆ క్రమంలో ఈ గ్రామాన్ని అక్కన్నవాడగా పేరు స్థిరపడిందని మరో కధనం . పరిణాక్రమంలో అకువాడ, అక్కన్నవాడగా కలిపి బ్రిటిష్ కాలం లో నేటి ఆకివీడుగా రూపాంతరం చెందిన్నది చరిత్రకారుల భావన. సుమారు 14 యోజనాల విస్థిర్ణంగా చెప్పబడుతున్న కొల్లేరు సరస్సుకు వెళ్ళాలంటే ఏకైక మార్గం ఆకివీడు గుండానే ఉండేది. కాలక్రమంలో సరస్సు పరిమాణం తగ్గింది. కొల్లేరు కాంటూరు స్తిరాకరణ ఈ గ్రామం ఆధారంగానే బ్రిటిష్ వారి కాలంలో చేశారన్నది అధికారుల భావన. ఆ కారణంగానే ఆకివీడు దిగువున ఉన్న ప్రాంతాలు కాంటూరు దిగువపరిధిలోకి వచ్చాయి. ఆ క్రమంలోనే కొల్లేటి సరస్సు ఏర్పాటుకు ఇప్పటికి ఈ గ్రామం ఆధారంగానే గణాంకాలు సాగుతున్నాయి. 1945 సంవత్సరం ప్రాంతంలో పచ్చిమగోదావరి రూపం ఏర్పాటు నాటికీ నేటి కృష్ణ జిల్లాకు మార్గం ఆకివీడు నుండే ఉండేది. కొల్లేరు నుండి నీరు సముద్రానికి పారేమార్గం అయిన ఉప్పుటేరు రెండు జిల్లాలను చీలుస్తుంది. ఈ ఎరుపై 1970 దశకంలో ఆకివీడు వద్ద వారధి నిర్మించేవరకు పడవలమీధ ఏరు దాటడమే మార్గంగా ఉండేది.ఉప్పుటేరుపై వారధి నిర్మాణం జరగడం, కొల్లేటి గ్రామాలకు కూడలిగా ఉండటం తో క్రమంగా అతి చిన్న గ్రామం 1980 దశకం నాటికీ తాలూకా స్థాయికి ఎదిగింది.ప్రస్తుతం మండలం కేంద్రం అయిన ఈ గ్రామం సుమారు 39 వేల జనాభాతో మునిసిపాలిటి స్థాయికి ఎదిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో నియోజకవర్గ కేంద్రంగా మార్చాలన్న ప్రతిపాదన నేటికి కార్య రూపం దాల్చలేదు. సామాజికంగా, ఆర్ధికంగా ఈ గ్రామం ఎదుగుదలకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉప్పుటేరు వంతెన లేని కారణంగా జిల్లాలో ఒక మూలకు విసిరినట్ట్లుగా ఉండేది. ఈ ఉప్పుటేరుపై వంతెన నిర్మించిన అనంతరం ఈ రోడ్డు ప్రధాన మార్గం కావడం, ఇటివల జాతీయ రహదారిగా ప్రకటించడం ఈ గ్రామం అభివృద్దికి ఉపకరించాయి.
కొల్లేరు ప్రజల అత్యంత ప్రధానమైన చేపల వేట స్థానంలో చేపల చెరువులు ఏర్పాటుతో అపారమైన ఆదాయానికి మార్గం సుగుమం అయింది . పలితంగా మండల కేంద్రంగా ఈ గ్రామం ఆర్ధిక పరిపుష్టిలో ముందుకు చేరింది. అంతకుముందుగానే రైస్ మిల్లులద్వార పారిశ్రామికరణకు శ్రీకారం చుట్టిన ఈ గ్రామానికి చేపల చెరువుల ఆదాయం తోడయ్యిది. ఆ క్రమంలో అవసరాలు పెరగడం, వ్యాపార రంగం, మార్కెటింగ్ అవసరాల స్థాయికి తగ్గ వ్యాపారం పెరగడం మునిసిపాలిటి స్థాయికి ఈ గ్రామం ఎదిగింది. సంవత్సరానికి సుమారు కోటి రూపాయల పైబడి ఆదాయం వస్తున్న ఈ పంచాయితీలో రమామి 70 లక్షల రూపాయల ఆదాయం గ్రామంలోని శిస్తుల ద్వార రావడం గమనార్హం. న్యాయ స్థానం మినహా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాన్ని ప్రస్తుతం ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. రాజికియంగా నియోజకవర్గంలోని ఎందరికో నైతిక మద్దతునిచ్చి చైతన్యపరచినప్పటికి ఈ గ్రామం రాజకీయంగా వెనుకబడి ఉన్నదని చెప్పవచ్చు. స్వాతంత్ర వచ్చిన నటి నుండి పిర్కాకేంద్రంగా , తదనంతరం సమితి, తాలూకా కేంద్రంగా ప్రస్తుతం మండల కేంద్రంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఇటివలే వెలుగు మొదలయ్యింది. మండలంలోని ఐ భీమవరం గ్రామానికి చెందిన కనుమూరి బాపిరాజు రాజికియంగా సమున్నత స్థాయికి ఎదిగారు. ఇక పెదకాపవరం నుండి కుసుమేస్వరావు, ఆయన బార్య అండాలమ్మలు కలిసి ఒక దఫా MLA గా పనిచేసిన చరిత్ర ఆకివీడు మండలానికి ఉంది.
విద్యా సదుపాయాలు
- P.L.S.Z.P.P. హైస్కూలు
- C.M.హైస్కూలు
- M.P.P.U.P స్కూలు
- బాలికల హైస్కూలు
- సైన్త్ అలొసియస్ హైస్కూలు
- జిల్లా గ్రంధాలయ సంస్థ లైబ్రరీ: ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోనే మొదటి డిజిటల్ లైబ్రరీ. 'DIGITAL LIBRARY' ఇందులో నాలుగు కంప్యూటర్లు ఉన్నాయి.
ఈ గ్రామం రాష్ట్ర రహదారి మీద ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ముఖ్య పట్టణాల నుండి, మరియు హైదరాబాదు నుండి ప్రతిరోజు బస్సు సదుపాయం ఉన్నది. రోడ్డు మార్గంలో ఏలూరు నుంచి రెండు గంటలోపు చేరుకోవచ్చు. ప్రతి 30 నిమిషములకు 1 బస్సు కలదు. ఆకివీడుకు రాష్ట్ర రాజధాని హైదరాబాదునుండి 437 కి.మీ., విశాఖపట్నం నుండి 288 కి.మీ., విజయవాడ నుండి 85 కి.మీ., భీమవరం నుండి 18 కి.మీ. ఇది రోడ్డు, రైలు మార్గములతో చక్కగా కలపబడినది.
రైలు మార్గము:
ఈ గ్రామం విజయవాడ - కాకినాడ లను కలిపే రైలు మార్గము మధ్యలో కలదు. చెన్నై (మద్రాసు), బెంగుళూరు ల నుండి కూడా ప్రయాణ సదుపాయం కలదు.
- విమాన మార్గము:
ఊరిలో జరిగే ఉత్సవములు/జాతరలు:
ఆకివీడు పురవాస ప్రజలకు భక్తి,శ్రధ్ధలు ఎక్కువ. ప్రతీ ఏటా ఉత్సవాలను సంప్రదాయరీతిలో ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. అందులో ముఖ్యమైనవి.
- వీరభధ్రస్వామి సంబరం
ప్రతీ ఏటా మహాశివరాత్రి నాడు శంకరుడిని పూజిస్తూ శివాంశ సంభూతుడైన వీరభధ్రస్వామిని కొలుస్తూ సాలిపేటలో వెలసిన వీరభధ్రస్వామి గుడి దగ్గర సంబరాన్ని భక్తి శ్రద్దలతో సంప్రదాయరీతిలో ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు చాలామంది శివభక్తులు శివశూలాలను దవడ మీద గుచ్చుకుని ఎడ్లబండ్ల మీద ఊరంతా తిరుగుతారు. ఈ సంబరాన్ని చూడటానికి రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. శివరాత్రినాడు రాత్రి జరిగే "నిప్పుల సంబరం" ప్రత్యేక ఆకర్షణ. ఈ "నిప్పుల సంబరం"లో పాల్గొనాలనుకునే శివభక్తులు ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. అలా ఉన్న భక్తులు మాత్రమే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిప్పులు మీద నడవగలరని ఒక విశ్వాసం. ఈ సంబరంలో ఏదో విధంగా పాల్గొన్న వారికి ఆ సంవత్సరం అంతా బాగా నడుస్తుందని విశ్వాసం.
- సుబ్రహ్మణ్యస్వామి షష్టి
సుబ్రహ్మణ్యస్వామి షష్టిని చాలా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. పూర్వకాలంలో చాలా వైభవంగా జరిగేది. ఊరులోని జనమంతా ఆ జాతరలోనే సమయం గడిపేవారు.
- దేశాలమ్మ సంబరం.
చుట్తుప్రక్కల చూడదగ్గ ప్రదేశాలు
- కొల్లేరు సరస్సు - రాష్ట్రములో రెండొవ అతి పెద్ద నీటి సరస్సు
- ప్రార్ధనా స్థలాలు
- కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం.
- కొల్లేరు పెద్దింట్లమ్మవారి మందిరం
- సెంట్రల్ బాప్టిస్ట్ చర్చి
- పెద్ద మసీదు, చిన్న మసీదు, అన్వారి మసీదు
- ఊరిలో ముఖ్యమైన స్థలాలు
- గాంధీ పార్క్
- సర్ అర్ధర్ కాటన్ మెమోరియల్ పార్కు
- జెడ్-టర్నింగ్
- డైలీ మార్కెట్టు
- బస్ స్టాండ్ ఏరియా
- ఆకివీడు మండలంలోని గ్రామాలు
- · అజ్జమూరు
- · చెరుకుమిల్లి
- · చినకాపవరం
- · అప్పారావుపేట
- · ధర్మాపురం
- · దుంపగడప
- · గుమ్ములూరు
- · కోళ్ళపఱ్ఱు
- · కొల్లేరు (నిర్జన గ్రామము)
- · కుప్పనపూడి
- · మాదివాడ · పెదకాపవరం
- · సిద్దాపురం
- · తరటావ