ఆకివీడు : ఆకివీడులో నిర్వహిస్తున్న వారపు సంత అసౌకర్యములతో కొట్టు మిట్టాడుతోంది. వారంలో ఒకరోజు నిర్వహించే దీని ద్వారా ఏడాదికి రూ 1.70లక్షలు ఆదాయం వస్తున్నా అమేరకు సౌకర్యాలు కొరవడ్డాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన షెడ్లు దెబ్బతిన్నాయి. సంత లేని రోజుల్లో ఈ ప్రాంతంలో నిత్యం పందులు. పశువులు సంచరిస్తున్నాయి. చుట్టు పక్కల ప్రజలు దుస్తులు ఆరవేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. దీనిపై ఈవో ఠాగూర్ మాట్లాడుతూ సంత అభివృద్ధికి నిధుల సమస్య ఉన్నట్లు చెప్పారు. సౌకర్యాల కల్పనకు మార్కెటింగ్ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.