Date : 26-06-2020
ఆకివీడు : జిల్లాలోనే అతిపెద్ద లే అవుట్ గా ఆకివీడు వెలసింది. ఇక్కడి ప్రజల దశాబ్దల జాగారం ఫలించింది. 74 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి సర్కారు సిద్ధమైంది. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో అప్పటి ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు చొరవతో పేదల ఇళ్ల స్థలాల కోసం కుప్పనపూడి, అయి భీమవరం, ఆకివీడు గ్రామాల మధ్య 74 ఎకరాల భూమి సేకరించారు. అయితే వైఎస్ రాజశేఖరెడ్డి హఠాత్మరణం తరువాత ఎవరు పట్టించుకోకపోవడంతో ఆ భూమిని పేదలకు పంచలేదు. ఈ నేపథ్యంలో ప్రజా సంకల్ప పాదయాత్రగా ఆకివీడు ప్రాంతానికి వచ్చిన సీఎం వైఎస్ జగనమోహన్రెడ్డి ఈ భూమిని పేదలకు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ 74 ఎకరాల ప్లాట్లుగా విడగొట్టి అతిపెద్ద లే అవుట్ ను అధికారులు సిద్ధం చేసారు. 3,273 మందికి పట్టాలు ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు. వైఎస్ రాజశేఖరెడ్డి కాలనీ గా నామకరణం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆకివీడు మండలంలోని మరో 101 ఎకరాలు సేకరించి పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇస్తున్నారు.