Ads by Google


ఆకివీడు లో ప్రైవేట్ హాస్పటల్ సీజ్

 Date : 31-08-2021 ఆకివీడు పట్టణ: ఆకివీడు లోని ఎస్ టర్నింగ్ సమీపంలో ఉన్న రమేష్ హాస్పటల్ కు అనుమతులతో పాటు, అరుహులైన వైద్యులు లేకుండా నిర్వహి... thumbnail 1 summary

 Date : 31-08-2021

ఆకివీడు పట్టణ: ఆకివీడు లోని ఎస్ టర్నింగ్ సమీపంలో ఉన్న రమేష్ హాస్పటల్ కు అనుమతులతో పాటు, అరుహులైన వైద్యులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రిని వైద్యాధికారులు సోమవారం సీజ్ చేశారు. వైద్య అధికారుల సమాచారం ప్రకారం పొదలి రమేష్ నిర్వహిస్తున్న రమేష్ హాస్పటల్ పై పిర్యాదు రావడంతో కలెక్టర్, డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు నర్సాపురం డిప్యూటీ వైద్యాధికారి ప్రసాద్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ పి.బాలు ఈ ఆస్పత్రిలో సోమవారం తనిఖీ నిర్వహించారు. నిబంధనలు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్నట్టు గుర్తించి ఓపీ విభాగం, వార్డులు, ఔషదాల విభాగాన్ని సీజ్ చేసారు. తదుపరి చర్యల నిమిత్తం పూర్తిస్థాయి నివేదికని ఉన్నతాధికారులకు అందజేస్తామని డిప్యూటీ డిఎంహెచ్ఓ ప్రసాద్ తెలిపారు.



Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9and Google Chrome and Mozilla Firefox
Copyright©2020 All Rights Reserved. Manaakividuinfo.com Website.