Ads by Google


నకిలీ పోలీసుల అరెస్టు

 Date : 31-08-2021 ఆకివీడు: పోలీసులమని బెదిరించి నగదు డిమాండ్ చేసిన కేసులో ఆకివీడు కు చెందిన నలుగురిని కృష్ణా జిల్లా కైకలూరు పోలీసులు సోమవార... thumbnail 1 summary

 Date : 31-08-2021


ఆకివీడు: పోలీసులమని బెదిరించి నగదు డిమాండ్ చేసిన కేసులో ఆకివీడు కు చెందిన నలుగురిని కృష్ణా జిల్లా కైకలూరు పోలీసులు సోమవారం అరెస్టు చేసారు. పోలీసుల కధనం ప్రకారం కైకలూరు మండలం రామవరం రోడ్డు ఇటీవల నలుగురు యువకులు ఇసుక లారీలను అపి ఎస్ఈబి పోలీసులుమంటూ నగదు డిమాండ్ చేశారు. రూ.50 వేలు ఇవ్వకపోతే స్టేషన్ కు తీసుకెళ్తామని బెదిరించిన క్రమంలో ఓ లారీ యజమాని చిట్టూరి నాగేశ్వరరావు కు అనుమానం వచ్చి కైకలూరు పోలీసులకు పిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన కైకలూరు ఎస్సై చల్లా కృష్ణ ఆకివీడుకి చెందిన అట్లూరి సంజయ్ కుమార్, కేతా చంద్ర శేఖర్ (అలియాస్ చందు), కురిటి కిరణ్ కుమార్, పెనుమత్స నరేష్ లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2024 All Rights Reserved. Manaakividuinfo.com Website.