Date :05-11-2022
ఆకివీడు : ఆకివీడు పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని సీఐ గీత రామ కృష్ణ తెలిపారు. దీనిలో భాగంగా ప్రధాన రహదారి వెంబడి ఉన్న దుకాణదారులకు శుక్రవారం రాత్రి అవగాహన కలిపించారు. దుకాణాల బయట అంచుల వరకు నీడ కోసం ఏర్పాటు చేసుకున్న షెడ్లు, ఇతర నిర్మాణాలను తొలగించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా సహకరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎసై రాజారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.