Date : 10-10-2023
ఆకివీడు : మాలాధారులందరికి ఉచితంగా అల్పాహారం, భోజన వసతిని ప్రముఖ రైస్ మిల్లర్ కొటికలపూడి సూర్యనారాయణ స్వామి సోమవారం ప్రారంభించారు. కుప్పనపూడి కి చెందిన నూకల రామదాసు స్వామి ఆధ్వర్యంలో మాలధారులకు ఆరేళ్లుగా ఉచిత భోజన వసతిని కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 11:30 గంటల నుంచి అల్పాహారం, భిక్ష అందిస్తున్నారు. సూర్యనారాయణ స్వామి మాట్లాడుతూ చుట్టూ ప్రక్కల గ్రామాలు, ప్రక్క జిల్లా నుంచి వచ్చి అధిక సంఖ్యలో మాలధారులు వచ్చి ఇక్కడ బిక్ష స్వీకరిస్తున్నారు. నిర్వహులు రామదాసు మాట్లాడుతూ సోమవారం నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఉచిత అల్పహారం, భిక్షను మాలధారులకు అందచేస్తున్నట్టు తెలిపారు. దాతల సహకారంతో, సొంత ఖర్చులతోను అయ్యప్ప, భవాని, వెంకటేశ్వర స్వామి, శివ మాలధారులందరికి భోజన వసతిని స్వాముల కరుణాకటాక్షాలతో కొనసాగిస్తున్నట్టు చెప్పారు.