ఆకివీడు టౌన్ : ఆకివీడు గ్రామదేవత పెద్దింట్లమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఛైర్మన్ గొంట్లా గణపతి, సభ్యులు గా కె. లలితకుమారి, ఓ.లక్ష్మి, బి.శ్యామల, ఏ.రామచంద్రరావు, పి.నారాయణరావు, కె.వెంకటరావు, డి.వెంకటేశ్వర రావు, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎం.పట్టాభి రామయ్యలతో భీమవరం భీమేశ్వరస్వామి ఆలయ ఈవో తోట శ్రీనివాసరావు ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు మోటుపల్లి రామవరప్రసాద్, ఏఎంసీ ఛైర్మన్ బొల్లా వెంకట్రావు, జనసేన పట్టణ అధ్యక్షుడు పిల్లా నరసింహరావు, ఆలయ ఈవో సత్యనారాయణరాజు పాల్గొన్నారు.