ఆకివీడు గ్రామీణ : అజ్జమూరు సచివాలయం సమీపంలో ప్రధాన మార్గం మలుపు లో ఆక్రమణల కారణంగా రోడ్డు ఇరుకుగా ఉంది. ఆ ప్రాంతంలో తరచు వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. పలువురు గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. మలుపు లో ఆక్రమణలు తొలగించి రహదారిని వెడల్పు చేయాలని స్పందనలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదని గ్రామానికి చెందిన వరప్రసాద్, రాజేశ్వరరావులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై గురువారం ఉదయం 11 గంటల నుంచి సచివాలయం వద్ద వరప్రసాద్ బైఠాయించి ఆందోళనకు దిగారు. ఒంటి గంట సమయంలో ఎంపీడీవో మార్కండేశ్వరరావు వచ్చి ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ప్రసాద్ ఆందోళన విరమించారు. సర్పంచి చలపతి, భాజపా మండల అధ్యక్షురాలు ఎం.నాగమణి పాల్గొన్నారు.