ఆకివీడు టౌన్: రైస్ మిల్లుల నుంచి వచ్చే ధూళి, దూగర, ఊక వల్ల నివాస ప్రాంతాల వారికి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని ఆ ప్రాంత మహిళలు శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఈ విషయాన్ని తహసీల్దారుకు ఫిర్యాదు చేయడంతో పరిస్థితిని పరిశీలించేందుకు మిల్లుల వద్దకు వచ్చి తనిఖీ చేశారు. ఊక, దూగర బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఊక గుట్టల్ని తొలగించాలని సూచించారు. దుమ్ము, ధూళిలను అరికట్టకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బి.రాంబాబు, సందక సూరిబాబు, ఉదయ కుమారి, చొక్కా ధనలక్ష్మి, వరలక్ష్మి, కం చి శ్రీను, బొత్స విమల, శిరీష, శ్యామలరావు, పాల్గొన్నారు.