Date : 08-09-2025
ఆకివీడు: కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచే విధంగా అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్.నర్శింహరాజు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు రైతు ద్వేషిగా నిరంతరం పాలన చేస్తున్నారన్నారు. ఏడాదిన్నర కూటమి పాలనలో రైతులు ఆర్థికంగా నలిగిపోయారన్నారు. రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవ అంటూ మార్చినా పథకం సక్రమంగా అమలు చేయలేకపోయారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టానికి గురవుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని నర్శింహరాజు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పండించిన పంటలకు కనీస ధర లభించడంలేదన్నారు. దళారుల బెడద పెరిగిపోయిందన్నారు. కూరగాయలు, పోగాకు, పసుపు, మిర్చి వంటి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడిపోతున్నారన్నారు.
యూరియా కోసం అన్నదాత విలవిల
పీవీఎల్ నర్శింహరాజు చేశారు. యూరియా కోసం ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం అన్నదాతలు విలవిల్లాడుతున్నారని పీవీఎల్ నర్శింహరాజు ఆవేదన వ్యక్తం బారులు తీరి రైతులు ఆపసోపాలు పడుతుంటే ఎరువులు అధికంగా వాడకండి అంటూ చంద్రబాబు హితవు పలకడం దురదృష్టకరమన్నారు. రైతులకు అవసరమయ్యే ఎరువుల్ని ముందుగా అందుబాటులో ఉంచుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే సమస్య తీవ్రమైందన్నారు. అన్నదాతకు వెన్ను దన్నుగా వైఎస్సార్సీపీ నిలుస్తోందన్నారు. ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల వద్ద అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని పార్టీ శ్రేణులకు, రైతులకు పిలుపునిచ్చారు.