Date : 03-09-2025
ఆకివీడు టౌన్: ఆక్రమణలు తొలగింపు విషయంలో రాజీపడొద్దని అధికారులను ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆదేశించారు. మంగళవారం ఆయన ఆకివీడులోని దత్తక్షేత్రాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని హోమం, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆ ప్రాంతంలో మురుగు బోదె వెంబడి ఉన్న ఆక్రమణలను పరిశీలించారు. వెంటనే సర్వే చేయించి తొలగించాలనే కమిష నర్ కృష్ణమోహన్ సూచించారు. ఆయన వెంట తెదేపా మండల అధ్యక్షుడు మోటుపల్లి రామ వరప్రసాద్, కె.కృష్ణమూర్తి, గొంట్లా గణపతి, గంధం ఉమా తదితర నాయకులు ఉన్నారు.