Date : 03-09-2025
ఆకివీడు టౌన్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ల ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతుల ప్రగతికి, వ్యవ సాయ ఆయకట్ల ప్రాంతా ల్లోని పుంత రోడ్లు అభి వృద్ధి చేసే దిశగా కృషి చేస్తానని ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. మంగళవారం ఆయన ఆకివీడు ఏఎంసీ పాలకవర్గ సభ్యుల సమావేశంలో మాట్లాడారు. ఏఎంసీలకు కోట్ల రూపాయలు ఆదాయం, నిల్వ ఉన్నా అభివృద్ధి పనులకు వినియోగించు కునే వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని రఘురామ తెలిపారు. మరమ్మతులు చేయాల్సిన కార్యాలయ భవనం, గోదాములు గురించి ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు ఉపసభాపతికి వివరించారు. సమావేశంలో పాల్గొన్న రఘురామకృష్ణరాజు, పాలకవర్గ సభ్యులు.