Date : 10-10-2022
ఆకివీడు టౌన్ : ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా గీత రామకృష్ణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రాంతంలోని పనిచేస్తూ వీఆర్ లో ఉన్న ఆయనను నూతన ఆకివీడు సర్కిల్ కి సీఐ గా నియమించారు. ఆకివీడు సర్కిల్ పరిధిలో ఆకివీడు, కాళ్ళ, ఉండి మండలాల పోలీస్ స్టేషన్ లు ఉన్నాయి. ఆకివీడు ఎస్సై కిరణ్ కుమార్, కాళ్ళ ఎస్సై గంగాధర్, సిబ్బంది ఆయనకు పుష్ప గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.