Date: 18-04-2026
ఆకివీడు గ్రామీణ : మండలంలోని పెదకాపవరం గ్రామంలో ఇండియన్ గ్యాస్ వినియోగదారుల తిప్పలు వర్ణనాతీతం. గ్యాస్ కోసం మండుటెండలో సిలిండర్లతో పట్టుకుని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రతి గురువారం గ్యాస్ వ్యాన్ వస్తుందని, గత రెండు వారాలుగా ఇండియన్ గ్యాస్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ఖాళీ సిలిండర్లతో గంటల తరబడి వేచి చూసినా కళ్లు కాయలు కాస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. మండుటెండల్లో గ్యాస్ బండలతో దీక్ష చేయాల్సి వస్తుందంటున్నారు. ఇండియన్ గ్యాస్ డీలర్ వెంటనే స్పందించి గ్యాస్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. వినియోగదారులకు 45 రోజుల వ్యవధి ఉండటంతో ఉమ్మడి కుటుంబాలలో గ్యాస్ వినియోగానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వాణిజ్య భారం
వాణిజ్య అవసరాలకు గ్యాస్ మరింత భారమైపోయింది. చిరు వ్యాపారులు, టీ స్టాల్స్, కాఫీ హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతరత్రా గ్యాస్ వినియోగించే వ్యాపార సంస్థలు గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కట్టెల పొయ్యిలు, ఊక పొయ్యిలు, బాయిలర్లు వంటి వాటిని వినియోగించి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. మార్కెట్లో గ్యాస్ కొరతతో ధరలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. గ్యాస్ బండల్ని బ్లాక్ లో కొనుగోలు చేసి కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో గ్యాస్ కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. యుద్ధ మేఘాలు ఎప్పటికీ చల్లారుతాయో, యుద్ధ నష్టాన్ని భర్తీ చేసుకుని, మళ్లీ ఉత్పత్తి రంగంలోకి గ్యాస్ కంపెనీలు దిగేందుకు సమయం పట్టే అవకాశం ఉంటుందంటున్నారు.
English version
Waiting Anxiously for Gas
Consumers in Pedakapavaram village waiting anxiously for gas
Akividu Rural: The plight of Indian Gas consumers in Pedakapavaram village of the mandal is indescribable. In the scorching heat, people are waiting with their gas cylinders, eyes fixed on the road for the arrival of the gas van. Every Thursday, a gas van is supposed to come, but for the past two weeks, consumers have been complaining about severe difficulties in the supply of Indian Gas. They are expressing their distress, saying they are exhausted from waiting for hours with empty cylinders. Some even said they might have to stage a protest with their gas cylinders in the intense heat. They are urging the Indian Gas dealer to respond immediately and resolve the gas issue. Because there is a 45-day gap for booking, joint families are facing significant problems with their gas consumption.
Commercial Burden
Gas has become even more of a burden for commercial needs. Small businesses, tea stalls, coffee hotels, restaurants, and other business establishments that use gas are facing severe difficulties due to the shortage. They are now using wood-fired stoves, husk stoves, and boilers to prepare food. Due to the gas shortage in the market, prices are slowly increasing, putting an additional burden on consumers. Some are buying gas cylinders in the black market to run their businesses. It is being warned that the gas shortage could worsen in the coming days. People are left wondering when the clouds of war will clear and how long it will take for gas companies to recover from war losses and return to full production.












.jpg)





