Date:25-05-2026
నిర్మానుష్యంగా ఆకివీడు జాతీయ రహదారి
రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ గ్రామాలు అగ్నిగుండంలా మారాయి. రహదారులు నిర్మానుష్యంగా మారి లాక్‌డౌన్‌ను తలపించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం ఉష్ణోగ్రత 46 డిగ్రీలు ఉండగా సాయంత్రం 6 గంటలకు 40 డిగ్రీలు ఉంది. భానుడు ఉగ్రరూపం చూపించడంతో ప్రజలు వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు.
మరోవైపు రాత్రి సమయంలో అప్రకటిత విద్యుత్తు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
English Version:
Deserted Akividu National Highway
Temperatures are increasing day by day. From 7 AM to 6 PM on Sunday, villages turned into furnaces. The roads became deserted, reminding people of a lockdown. People are terrified at the very thought of stepping out of their houses. While the temperature on Sunday was 46 degrees, it stood at 40 degrees by 6 PM. As the sun showed its fierce form, people were overwhelmed by the intense heat and humidity.
On the other hand, people are facing severe hardships due to unannounced power cuts during the night.












.jpg)





