Ads by Mana Akividu Info


ఆకివీడులో గంజాయి బ్యాచ్ అరెస్టు

   Date: 31-05-2026 ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు: 2.6 కిలోల గంజాయి స్వాధీనం ఆకివీడు : ఆకివీడులో శనివారం పోలీసులు గంజాయి బ్యాచ్‌ని ... thumbnail 1 summary

  Date: 31-05-2026


ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు: 2.6 కిలోల గంజాయి స్వాధీనం
ఆకివీడు :ఆకివీడులో శనివారం పోలీసులు గంజాయి బ్యాచ్‌ని పట్టుకున్నారు. ఆకివీడు శివారు ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద మందపాడు వెళ్లే మార్గంలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద గంజాయి పంచుకుంటున్న ఐదుగురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆకివీడు సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ కాశీ చరణ్ వివరించారు.

ఆకివీడు స్టేషన్ రోడ్ లోని రెడ్డి వీధికి చెందిన బళ్లారి కీర్తి రాజు, సమతా నగర్ కు చెందిన కొమ్మారెడ్డి సత్యనారాయణ, దుంప గడప తిమ్మరాజు కాలనీకి చెందిన శాఖా సంజయ్, ఆకివీడులోని జవహర్ పేటకు చెందిన కొమ్ము పెద్దిరాజు, చినకాపవరం గ్రామానికి చెందిన తోకల రాజులను అరెస్టు చేసి వీరి వద్ద నుండి రెండు కేజీల 600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.

ఆకివీడులో గంజాయి అమ్మకాలు సాగుతున్నాయని సమాచారం రావడంతో జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి, డిఎస్పీ రఘువీర్ విష్ణు ఆదేశాలతో రంగంలో దిగామన్నారు. వీరిలో ముగ్గురు పాత నేరస్తులుగా సీఐ వివరించారు. మారేడుమిల్లి ప్రాంతాన్నించి ఇక్కడకు తీసుకువచ్చి గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చామన్నారు. వీరి నుంచి నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరందరిపై రౌడీషీట్ తెరుస్తామని చెప్పారు. గంజాయి బ్యాచ్ ని పట్టుకోవడంలో సహకరించిన కానిస్టేబుల్ విజయ్, శివ, శంకర్, వాసులకు సిఐ రివార్డులు అందించారు. ఎస్సై హనుమంతు నాగరాజు సమావేశంలో పాల్గొన్నారు

English version 
Ganja Batch Arrested in Akividu
Police take five into custody: 2.6 kg of Ganja seized
Akividu : On Saturday, police caught a ganja gang in Akividu. The police tactfully apprehended five individuals who were distributing ganja near the dumping yard located on the route leading to Mandapadu, near the Upputeru bridge on the outskirts of Akividu. CI Kashi Charan explained the details during a press conference organized at the Akividu CI office.

The CI stated that Ballari Kirthi Raju from Reddy Street on Akividu Station Road, Kommareddy Satyanarayana from Samatha Nagar, Shakha Sanjay from Dumpagadapa Thimmaraju Colony, Kommu Peddiraju from Jawahar Peta in Akividu, and Thokala Raju from Chinakapavaram village were arrested, and 2 kilograms and 600 grams of ganja were seized from them.

He mentioned that they swung into action following instructions from District SP Nayeem Asmi and DSP Raghuveer Vishnu after receiving information about ganja sales ongoing in Akividu. The CI explained that three of them are habitual offenders. It has been preliminary established that they were bringing ganja from the Maredumilli area to sell it here. Four cell phones were also seized from them. He said that rowdy sheets would be opened against all of them. CI presented rewards to constables Vijay, Shiva, Shankar, and Vasu, who assisted in apprehending the ganja batch. SI Hanumanthu Nagaraju also participated in the meeting

Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2026 All Rights Reserved. Manaakividuinfo.com Website.