Ads by Mana Akividu Info


ప్రమాద భరితంగా జాతీయరహదారి కల్వర్టులు

 Date : 06-08-2026 ఆకివీడు టౌన్: జాతీయ రహదారి నెం.165పై పలుచోట్ల కల్వర్టులు, రోడ్డు మార్జిన్లు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. వేలాది ... thumbnail 1 summary

 Date : 06-08-2026


ఆకివీడు టౌన్: జాతీయ రహదారి నెం.165పై పలుచోట్ల కల్వర్టులు, రోడ్డు మార్జిన్లు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ఈ మార్గంలో చాలా కల్వర్టులు పురాతనమైనవి కావడంతో పిట్టగోడలు విరిగిపోయాయి. గంగానమ్మ కోడు, ఐబీ మువరం రోడ్డు, తెల్లవంతెన, మాదివాడ సెంటర్ల వద్ద కల్వర్టులు కుంగిపోయి, నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎదురుగా వాహనాలు వస్తే కిందపడిపోయే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు శాశ్వత మరమ్మతులు చేయకుండా, కేవలం రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్డులతో సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి. అలాగే, వర్షపు నీటితో నిండిన ప్రమాదకర మార్జిన్లు, ఆక్రమణల వల్ల రోడ్డుపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఎన్‌హెచ్ అధికారులు స్పందించి, శిథిలావస్థలో ఉన్న కల్వర్టులను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2026 All Rights Reserved. Manaakividuinfo.com Website.